1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Makers of Adipurush remove controversial dialogue

'ఆదిపురుష్' చిత్ర బృందం కీలక నిర్ణయం - ఆ సంభాషణలు తొలగింపు

adipurush poster1
ప్రభాస్ - కృతి సనన్ జంటగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం విడుదలైన టాక్‌తో నిమిత్తం లేకుండా కలెక్షన్ల పరంగా దూసుకెళుతుంది. అదేసమయంలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. చరిత్రని వక్రీకరించారని, పాత్రల ఔచిత్యం దెబ్బతిన్నదని, దుస్తుల ఎంపిక కూడా బాగాలేదన్న కామెంట్లు వినిపించాయి. హనుమంతుడు పలికిన కొన్ని సంభాషణలపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై చిత్ర బృందం స్పందించింది. వివాదాస్పదమైన సంభాషణలు తొలగిస్తామని ప్రకటించింది. 
 
'ఆదిపురుష్' రచయిత మనోజ్ శుక్లా వివరణ ఇస్తూ 'ప్రేక్షకుల మనోభావాల్ని మేం గౌరవిస్తున్నాం.. అందుకే మా టీమ్ అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకొంది. కొన్ని సంభాషణలను తొలగిస్తున్నాం. ఈ సినిమా కోసం నేను నాలుగు వేల పంక్తుల సంభాషణలు రాశాను. అందులో ఐదారు సంభాషణల్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. శ్రీరాముడు, సీత, హనుమాన్‌ల విశిష్టతని చెబుతూ ఎన్నో మంచి మాటలు, పాటలూ రాశాను. కానీ వాటితో పోలిస్తే ఈ నాలుగు మాటలే ఎక్కువ ప్రభావం చూపించాయనిపిస్తోంది. చాలా మంది నన్ను ఘోరంగా తిడుతున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోవడం లేదు అని ట్వీట్ చేశారు. 
తర్వాతి కథనం
సుధీర్ బాబు చిత్రం మా నాన్న సూపర్ హీరో