గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (18:38 IST)

కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టిస్తున్న ఆదిపురుష్ : నిర్మాతలు

Shashi, Kriti Prasad, Vivek Kuchibotla
Shashi, Kriti Prasad, Vivek Kuchibotla
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ మహా గ్రంధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈరోజు విడుదలైన దగ్గర నుంచి సూపర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది.  550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఈరోజు సాయంత్రం నిర్వహించారు. 
ఈ సక్సెస్ మీట్ కి యు.వి. క్రియేషన్స్ వంశీకృష్ణ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు. 
 
ఈ సందర్బంగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ…"మేము మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్.ఎల్.పి వైజాగ్ లో పెట్టి ఇంచుమించు ఇది ఆరో నెల. మేము ఆది పురష్ సినిమా మా ప్రయత్నం చేస్తే వచ్చింది అనేదానికన్నా, ఆ రాముడు భక్తుడిగా మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకున్నారు అనేది మా నమ్మకం. ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు కి ఇలాంటి గొప్ప సినిమా తీసుకెళ్లడానికి  మాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఆ రాముడు అని మేము భావిస్తున్నాం. మా మైత్రి నవీన్ గారు కూడా ఈ సినిమా యూఎస్ లో చూసి, శశి చాలా బాగుంది అని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా నైజం లో టాప్ త్రీ మూవీస్ లో ఒకటి అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి దగ్గర నుంచి ఒకటే మెసేజెస్ మరియు కాల్స్ వస్తున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్  అవుతుంది అని అంటున్నారు. ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా వస్తున్నారు. మాట్నీ నుంచే 30% ఫ్యామిలీస్ మరియు లేడీస్ సినిమాకి వస్తున్నారు అని అంటున్నారు. సాధారణంగా ఆదివారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. కానీ ఈ సినిమాకి మొదటి రోజు నుంచే ఫ్యామిలీస్ రావడం అనేది రామాయణం యొక్క గొప్పతనం. ప్రతి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతి దగ్గర హౌస్ ఫుల్ అవుతుంది. నైజాంలో మల్టీప్లెక్స్ పరంగా చూస్తే 1000 స్క్రీన్ కి పైగా  ప్రదర్శించిన సినిమా ఇదే. ఇంతకుముందు ఏ సినిమా కి కూడా ఇలా జరగలేదు. ఖచ్చితంగా ఫస్ట్ వీక్ ఆల్ టైం రికార్డ్ ఈ సినిమా సాధిస్తుంది అని  మేము భావిస్తున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు" అని తెలియజేశారు.
 
పీపుల్స్ మీడియా కృతి ప్రసాద్ మాట్లాడుతూ "మీరు ఇచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు. మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే తప్పకుండా మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో ఈ సినిమా చూడండి". అని తెలియజేశారు.
 
వివేక్ కుచిబొట్ల మాట్లాడుతూ.. "ఈ సినిమా మాకు రావడానికి ముఖ్య కారణమైన వంశీ గారికి, విక్కీ గారికి, ప్రమోద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే ఈ సినిమా మేము చేసిన వెంటనే ప్రభాస్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన ఒక కొత్త టైపులో ట్రై చేశాము త్రీడీలో చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇక ఈరోజు సేమ్ అన్ని ఏరియాస్ నుంచి ప్రేక్షకులు అదే చెప్తున్నారు. త్రీడీ చాలా ఎంజాయ్ చేస్తున్నామని తెలియజేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ షో మా ఫ్యామిలీ వాళ్ళు చూసి కూడా చాలా బాగుందని తెలియజేశారు. వాళ్లు 2డి లో చూసి మళ్ళీ  త్రీడీలో కూడ చూసి చాలా అద్భుతంగా ఉంది అని తెలియజేశారు. ఇందాక శశి గారు చెప్పినట్టు ఫ్యామిలీస్ కూడా ఫస్ట్ డే నుంచే వస్తున్నారు. ఈ సినిమాకి ఎక్కడా లేనన్ని మార్నింగ్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. ప్రతి షో హౌస్ ఫుల్ అయింది. రామాయణం సినిమా కి ఫాన్స్ నుంచి ఇంత సపోర్ట్ రావడం సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కమర్షియల్ వాల్యూస్ తో కలిపి ఈ సినిమా ఒక హిస్టారికల్ గా తీయడం జరిగింది. దాని వలన అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక అవెంజర్స్, ఒక హాలీవుడ్ సినిమా ఎలా ఉంటుందో అంతా గొప్పగా గ్రాఫిక్స్ తో ఈ సినిమాని దర్శకుడు తీశారు. మన రామాయణ కథ తర్వాత తరాల వారికి అలానే ఇప్పుడు జనరేషన్ కి చాలా సులభంగా అర్థమయ్యేలాగా తీసి దర్శకుడు గొప్ప ప్రయత్నం చేశారు.  ఆ ప్రయత్నానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందరూ 3 వేల కోట్లు పెట్టే హాలీవుడ్ సినిమాలతో మన ఆదిపురుష్ సినిమాని పోలుస్తున్నారు ఇది మనం సాధించిన అచీవ్ మెంట్" అని తెలియజేశారు.