బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (12:58 IST)

ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ అలరిస్తాడా! రివ్యూ రిపోర్ట్‌

Adipurush poster latest
Adipurush poster latest
నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్
 
సాంకేతికత: దర్శకుడు : ఓం రౌత్, నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్,  సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ : అజయ్ – అతుల్ మరియు సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
 
మానవజాతికి ఆదిపురుషుడుగా శ్రీరామచంద్రునిగా చెబుతారు. అందుకే ఆయన పేరుతో ఈనాటి ట్రెండ్‌కు తగినట్లుగా సినిమా తీయాలని ప్రభాస్‌ను ఎంచుకుని మరీతీశారు. టీసీరిస్‌ కంపెనీతోపాటు ఓంరౌత్‌ కూడా నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌లోనే ఏదో వుందనిపించేలా చేసిన ఆదిపురుష్‌ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
ఇది రాముడు, సీత, రావణాసుడికథ. అందరికీ తెలిసిందే. అందుకే రాముడి తండ్రి అయోధ్య గురించి కొంత యానిమేషన్‌ చూపించి ఆ తర్వాత రాముడు అడవికి వెళ్ళిన వైనం నుంచి కథ సాగుతుంది. అక్కడ శూర్పణక్క ముక్కును లక్ష్మణుడు కత్తిరించడం, అది తన అన్న పది తలల రావాణాసురిడికి చెప్పడమేకాకుండా అన్నీ వున్నా ఏదో లోపం వుంది అది జానకి నీ చెంతవుంటే తీరుందని అన్నను రెచ్చగొట్టి పంపిస్తుంది. ఆ తర్వాత రావణాసుడు జానకి వున్న ప్రాంతానికి మాయారూపంలో వచ్చి ఆమెను అపహరించడం ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ రాముడు, లక్ష్మణుడు సుగ్రీవుడు, ఆంజనేయుల సాయంతో లంకపై దండెత్తి జానకి ని తన వెంట తీసుకురావడమే కథ.
 
విశ్లేషణ:
రామాయణ గాథను దేశంలోని మారుమూలప్రాంతాల్లోనూ జానపదాలుగా నాటకాలుగా రకరకాల కళాకృతులతో చూపించి అలరించేశారు. తెలుగులో రామాయణ గాథను పుస్తకాల్లోనూ పొందుపరిచారు. ఏ పార్టీకి చెందిన ప్రభుత్వాలయినా రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు. టాలీవుడ్‌లో రాముడు పాత్ర అంటే ఎన్‌.టి.ఆర్‌. అనిపించేలా ప్రేక్షకుల హృదయాల్లో ఇమిడిపోయాడు. అలాగే ఉత్తరాదిలో రకరకాలు నటులు పాత్రలు పోసించి తమదైన శైలిలో నటించారు. 
 
ఇక ఇప్పటికి వచ్చేసరికి ఆదిపురుష్‌ సినిమాను తీసింది ఉత్తరాదివారైనా పాత్ర పోషించింది తెలుగు వాడైన ప్రభాస్‌ కావడం విశేషం. అలాగే వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆదర్శంగా పూర్తిగా తీసుకోలేదు. కొద్దిపాటి విషయాన్ని తీసుకుని సినిమాపరంగా కల్పితంగా కూర్చామని ముందే చెప్పేశారు. ఈ సినిమానే ఆదర్శంగా తీసుకుని రామాయణగాథ అనుకోవద్దని హెచ్చరిక కూడా చేశారు. పూర్తిగాతెలియాలంటే వాల్మీకి రామాయణాన్ని ఒకసారి చదవండి అని కూడా సూచించారు. మరి ఇన్ని చెప్పిన వాళ్ళు సినిమా ఎందుకు తీశారనే ప్రశ్న తలెత్తుంది. ఇప్పటి జనరేషన్‌కు ప్రభాస్‌ వంటి జాతీయస్టార్‌తో చేస్తే అందరూ చూస్తారనే ఐడియాతో తీసినట్లు కనిపిస్తుంది. పనిలోపనిగా రాజకీయ నేపథ్యం కూడా వుంది అనేది అర్థమయిపోతుంది. విడుదలకు ముందే జైశ్రీరామ్‌ అనే నినాదాలతో పలు యూనివర్శిటీలు, కాలేజీల్లోనూ హిందూత్వం వంటి సంస్థలు దీన్ని తమ భుజాలపై మోశారు. 
 
గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ లేని రోజుల్లోనే రామ రావణ యుద్ధం తీస్తే ఆసక్తిగా అనిపించేది. మరి ఇప్పుడు అన్ని సౌకర్యాలు వున్నాయి కాబట్టి,  రావణాసుర రాజ్యం, గాలిలోకి హనుమంతులు ఎగరడం, యుద్ధాలు చేయడం వంటివి సరికొత్తగా అనిపిస్తాయి. అందుకు సాంకేతికతను వాడుకున్నారు. కానీ అవి కొన్నిచోట్ల సరైన దిశలో ఉపయోగించుకోలేదనిపిస్తుంది.  
 
3డి ఫార్మెట్‌లో చూస్తే ఇది ఓ కార్టూన్‌ సినిమాలా అనిపిస్తుంది. అందుకే ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. మొదటిభాగం కంటే ద్వితీయార్థంలో సాంకేతికతను ఫుల్‌గా ఉపయోగించుకుని ఓ లోకంలో తీసుకెళతారు. కానీ రవాణాసురి సామ్రాజ్యం విలన్‌ డెన్‌లా అనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాలు పర్వాలేదు. 
 
వాటికంటే సంభాషణలు ద్వారా రామునికి ధర్మం గురించి, స్త్రీ జాతికి అన్యాయంచేస్తే ఎలా బుద్ది చెప్పాలో వంటివి, వానరసేనకు మీ కోసం పోరాడండి. నా కోసం పోరాటంకాదు. వేల సంవత్సరాలు మీ పౌరుష పరాక్రమాలు చెప్పుకోవాలి. భరతఖండంలో స్త్రీ పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఫలితం ఎలా వుంటుందో అందుకోసం పోరాడండి అంటూ వానర సైన్యాన్ని ఇన్‌స్పైర్‌ చేస్తూ ప్రభాస్‌ పలికిన డైలాగ్‌లు సినిమాకు కీలకం.
 
అయితే రాముని లుక్‌ పరంగా ఆజానుబాహుడుగా ప్రభాస్‌ బాగున్నా, రామాయణ గాథ ల్లో అందగాడు, ఎర్రటి పెదాలు వున్నవాడు అని వుంటుంది. కానీ ఇందులో పెదాలపై సరైన శ్రద్ధ దర్శక నిర్మాతలు పెట్టలేదనిపిస్తుంది. రాముడికి మీసాలు వున్నాయా? లేవా? అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టదు. దీనిపై క్లారిటీ కూడా సినిమాలో లేదు. 
 
యుద్ధంలో భాగంగా సముద్రుడి సాయం కోరుతూ వినకపోతే పాశుపశాస్త్రం ప్రయోగించే సమయానికిరావడం వంటి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అలరిస్తాయి. అయితే ఈ ప్రోసెస్‌ చాలా చోట్ల కృతంగా కూడా కొన్ని సన్నివేశాలుఅనిపిస్తాయి. కొన్ని చోట్ల బోర్‌ కూడా కొడుతుంది. తెలిసిన కథే కాబట్టి ఎక్కడా ట్విస్ట్‌లు వంటివి వుండకపోవడంతో పెద్దగా ఆసక్తి అనిపించదు. 
 
రావణాసురుడు గబ్బిలం వాహనంగా చూపించాడు. ఆయన సైన్యం గ్రహాంతవాసులు ఎలియెన్స్‌గా ఇందులో చూస్తున్నట్లు అనిపిస్తుంది. రాముడు యుద్ధం వారితోనా అన్నట్లుగా సెకండాఫ్‌ వుంటుంది. ఏదో చెప్పబోయే ఏదో చేసినట్లుగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా కుటుంబంతో చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.