శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (10:03 IST)

చీరకట్టుపై మంగ్లీ పాట.. అదిరిపోయింది.. వీడియో

భారతదేశ సంప్రదాయాలకు గొప్పతనం వుంది. ఇంకా భారతీయ వస్త్రధారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మహిళల అందాన్ని, చీర మరింత ఎక్కువ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి చీర మీద పాట పాడితే ఎలా ఉంటుంది. అచ్చమైన చీరకట్టు మీద అచ్చ తెలుగులో అందమైన పాట కొద్ది సేపటి క్రితమే రిలీజైంది. జానపద గాయనిగా పరిచయమై అటు యూట్యూబ్‌లో ఇటు సినిమాల్లో పాటలు పాడుతూ సంచలనం సృష్టిస్తున్న మంగ్లీ, చీరకట్టుపై పాటను పాడింది. లాయిరే లల్లాయిరే అనే ఈ పాటని చాలా చక్కగా చిత్రీకరించారు.
 
వలపులొలుకుతున్నయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నయే సింగారాలు.. అంటూ మొదలైన ఈ పాట ఆద్యంతం చాలా వినసొంపుగా ఉంది. మంగ్లీ గాత్రంలోని పదునుకి పాట మరింత అందంగా వినిపిస్తుంది. ఇంకా, తిరుపతి మాట్ల సాహిత్యం చాలా చక్కగా కుదిరింది. ముఖ్యంగా పుట్టింటా పట్టుచీర, నట్టింటా అడుగుపెట్టి తిరుగుతుంటే సందడులాయే తియ్యని సంబురమాయే అనుకుంటూ, ముగ్ధ చీరల చాటున దాగిన ముచ్చటలెన్నో చిరునవ్వుల తెరచాటున మదినే దోచే అన్న మాటలు పాటలోని చిలిపి అల్లరిని గుర్తు చేస్తున్నాయి.
 
జాబిలమ్మలు, జాజిపూల కొమ్మలు, అందాలు ఆరబోసుకున్న పూలకొమ్మలు ఆడవాళ్ళు అంటూ అందంగా రాసారు. మొత్తానికి అటు సాహిత్య పరంగా, ఇటు గాత్ర పరంగా పాట అద్భుతంగా వచ్చింది. ఇప్పటి వరకు మంగ్లీ పాడిన చాలా పాటల్లో చెప్పుకోదగ్గ పాటగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పాటని చిత్రీకరించిన విధానం చాలా బాగుంది. పెళ్ళి మండపంలో ఆడవాళ్ళందరూ కలిసి పాడుకున్న అందమైన పాటలా ఆహ్లాదంగా అద్భుతంగా ఉంది. ఈ పాటను మీరూ లుక్కేయండి.