శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 ఆగస్టు 2023 (19:08 IST)

స్టేజిపై నటి మన్నరా చోప్రాకి ముద్దుపెట్టిన డైరెక్టర్- video

Mannara
ప్రియాంక చోప్రా పిన్ని కుమార్తె, చెల్లెలు అయిన నటి మన్నరా చోప్రాకి దర్శకుడు స్టేజిపైనే ముద్దు పెట్టేసాడు. రాజ్ తరుణ్ సరసన 'తిరగబడరా సామి' చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రం టీజర్ లాంచ్‌ ఏర్పాటు చేసారు.
 
Mannara chopra
సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు రవితో కలిసి మన్నరా చోప్రా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తోంది. ఆ సమయంలో దర్శకుడు ఆమె భుజం చుట్టూ చేయి వేసాడు. అలా భుజంపై చేయి వేయడమే కాస్తంత ఇబ్బందిగా వుంటే, దర్శకుడు ఇంకాస్త ముందుకు వెళ్లి అకస్మాత్తుగా మన్నరా బుగ్గలపై ముద్దుపెట్టి ఆమెను షాక్‌కి గురి చేసాడు. ఈ వీడియో క్లిప్‌ను చూస్తుంటే మన్నరా అతడిలా చేస్తాడని అనుకోలేదని తెలుస్తోంది. కెమెరామెన్లు ఇబ్బందిగా నవ్వుతూ కనిపించారు. ఆమెకి జరిగిన అవమానాన్ని దాచుకోవడానికి ప్రయత్నించడాన్ని నెటిజన్లు గమనించారు.
 
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. నటి అనుమతి లేకుండా ఆమెని అలా ముద్దుపెట్టుకుని అసౌకర్యానికి గురిచేసినందుకు సోషల్ మీడియాలో దర్శకుడిని తిట్టిపోస్తున్నారు. ఇవి లైంగిక వేధింపులు కాక ఇంకేమిటి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ వైరల్ వీడియోపై నటి మన్నారా చోప్రా ఇంకా స్పందించలేదు.