బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (12:22 IST)

''మీలో ఎవరు కోటీశ్వరుడు'' ఒక్క షోకు రూ.10లక్షలు: చిరంజీవితో రాయ్‌లక్ష్మీ చిందులు.. ఆ సెంటిమెంట్?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు అంతగా కలిసిరాకపోవడంతో తిరిగి సినిమాలపై దృష్టి పెట్టాడు. టాలీవుడ్‌లో మాస్ ఇమేజ్‌ ఉన్న చిరంజీవి మళ్లీ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చాటేందుకు రెడీ అవుతున్నారు. హీరోగా మంచి ఫామ్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు అంతగా కలిసిరాకపోవడంతో తిరిగి సినిమాలపై దృష్టి పెట్టాడు. టాలీవుడ్‌లో మాస్ ఇమేజ్‌ ఉన్న చిరంజీవి మళ్లీ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చాటేందుకు రెడీ అవుతున్నారు. హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంతగా ఓ పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు సినిమాలపై పూర్తిగా దృష్టి సారించారు. చిరంజీవి తిరిగి వెండి తెరపై మెరవబోతున్నారు. తమిళ సూపర్ హిట్ చిత్రం అయిన కత్తి సినిమా రిమేక్ చిత్రం 'ఖైదీ నెం. 150' గా రిమేక్ చేస్తున్నారు. వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుంది. 
 
ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. తాజాగా చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో కోసం చిరంజీవి ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఒక్క షోకి చిరంజీవి ఎంత మొత్తం తీసుకుంటున్నారో తెలుసా? అక్షరాలా రూ.10 లక్షలు. ఒకే ఒక్కరోజు షో పది లక్షలు తీసుకుంటే.. ఇక 4వ సీజన్ మొత్తం ఎన్ని షోలుంటే ఎన్ని పదిలక్షలు పుచ్చుకుంటారోనని సినీ పండితులు షాక్ అవుతున్నారు. 
 
చిరంజీవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధపడుతున్నారు. ఇంతకుముందు ఈ షోకి నాగార్జున హోస్ట్‌గా ఆ స్థానంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోతో తన రాబోయే చిత్రం 'ఖైదీ నెం.150'కి ఇప్పటి నుంచి మంచి ప్రమోషన్ అవుతుందనే ఉద్దేశ్యం కాబోలు చిరు బుల్లితెరపై కనిపించి మురిపిస్తున్నారు.
 
మరోవైపు ఖైదీ నెంబర్ 150 సినిమాలో రాయ్ లక్ష్మీ ఐటమ్ గర్ల్‌గా ఎంపికవడంపై మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేథరిన్ స్థానంలో రాయ్ లక్ష్మీని తీసుకోవడం ద్వారా తమ్ముడు సెంటిమెంట్‌ను అన్నయ్య గుర్తుంచుకోలేదా అని మెగాఫ్యాన్స్ అంటున్నారు. మెగా హీరోలలో ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మాత్రమే  రాయ్ లక్ష్మీ కనిపించింది. ఈ ఏడాది సమ్మర్ లో విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో ‘తోబా తోబా…’ పాటలో పవన్‌తో పాటు ఆడిపాడింది. అయితే పాట బంపర్ హిట్ అయ్యింది గానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
 
స్పెషల్ సాంగ్స్‌తో రవితేజ వంటి హీరోలకు హిట్లు అందించిన లక్ష్మీ రాయ్.. పవన్‌కు మాత్రం హిట్ సంపాదించిపెట్టలేకపోయింది. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం అన్నయ్య సినిమాకు ఇలాంటి సెంటిమెంట్లు ఏమాత్రం పనిచేయవంటున్నారు. మరి పవన్ సెంటిమెంట్.. చిరు సినిమాకు కలిసొస్తుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.