'సైరా' నుంచి ఇక టీజరే ఆలస్యం.. 20న ముహూర్తం..

మోహన్| Last Updated: బుధవారం, 14 ఆగస్టు 2019 (17:06 IST)
మెగాస్టార్ నటించే 151 చిత్రం త్వరలో విడుదల కానుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా 'సైరా' అనే పేరుతో చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే.


కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా సైరా మేకింగ్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
1.47 నిమిషాల నిడివి గల ఈ మేకింగ్ వీడియోలో సినిమా కోసం ధరించిన దుస్తులు, ఉపయోగించిన కత్తులు, ప్రధాన తారాగణం గెటప్‌లను ప్రధానంగా చూపించారు. మొత్తానికి చిత్ర యూనిట్ మేకింగ్ వీడియోతో మరోసారి అభిమానుల అంచనాలను పెంచేసింది. అలాగే సైరా టీజర్ ఈ నెల 20న రానుందని కూడా వెల్లడించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ మూవీ హిందీ రైట్స్ సొంతం చేసుకున్నాడు.
 
కాగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రానున్న ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తుండగా ఆలిండియా సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు జగపతి బాబు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, రేసుగుర్రం రవికిషన్, తమన్నా, నిహారిక కొణిదెల తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.దీనిపై మరింత చదవండి :