మీర్జా ట్రైలర్ రిలీజ్.. ట్విట్టర్లో షేర్ చేసుకున్న సోనమ్ కపూర్!
బాలీవుడ్ నటుడు తనయుడు హర్షవర్ధన్ కపూర్, సయామి ఖేర్, అనుజ్ చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్నచిత్రం 'మీర్జా'. వీరిద్దరికీ బాలీవుడ్లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఆర్ఒఎంపి పిక్చర్స్ పతాకంపై సినిస్తాన్ ఫిల్మ్ సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. రాకేశ్ ఓంప్రకాశ్ మేహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు గుల్జార్ కథను అందించారు.
శంకర్ ఈసాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైంది. దీన్ని హర్షవర్ధన్ కపూర్ సోదరి సోనమ్‌కపూర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ టీజర్ ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అక్టోబరు 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.