సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (17:23 IST)

#LIE.. 'మిస్ స‌న్ షైన్' అంటున్న నితిన్ - మేఘా ఆకాష్ (వీడియో)

టాలీవుడ్ యువ హీరో నితిన్, హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం "లై". వచ్చే నెల 11వ తేదీన విడుదలకానుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు జరుగుతున్నాయి. యాక్ష‌న్ హ

టాలీవుడ్ యువ హీరో నితిన్, హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం "లై". వచ్చే నెల 11వ తేదీన విడుదలకానుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు జరుగుతున్నాయి. యాక్ష‌న్ హీరో అర్జున్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
 
రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలోని సాంగ్స్ ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ మూవీపై మంచి హైప్ తెస్తున్నారు. ఇటీవ‌ల‌ 'మిస్ స‌న్ షైన్' ఆడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ వ‌న్ మినిట్ వీడియో సాంగ్ విడుద‌ల చేసి ఫ్యాన్స్‌లో సినిమాపై ఆస‌క్తి పెంచారు. ఇందులో హీరో హీరోయిన్ల రొమాన్స్‌తో పాటు చిత్రంలోని లొకేష‌న్స్ అందరిని అల‌రిస్తున్నాయి.