సోమవారం, 3 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (11:08 IST)

వరుణ్ తేజ్ మిస్టర్ ఫస్ట లుక్ టీజర్ రిలీజ్: మనం ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే.. ప్రేమ మనల్ని వెతుక్కుంటూ...?

మెగాస్టార్ ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చే

మెగాస్టార్ ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనా.. షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ గాయపడటంతో ఆలస్యమైంది. త్వరలోనే ఆడియో మూవీ రిలీజ్ డేట్స్ను ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరుణ్‌తేజ్‌ స్థాయి పెంచే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే 80 శాతం సినిమా పూర్తయింది.

రెండు పాటలు, క్లైమాక్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్‌ 14న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్‌ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్‌: రూపా వైట్ల.