బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (10:32 IST)

నితిన్ కపూర్ ఆత్మహత్యకు వేరే కారణాలు కావొచ్చు : మోహన్ బాబు

సహజనటి జయసుధ భర్త, దర్శక నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్యకు ఆర్థిక కష్టాలు మాత్రం కాదనీ, మరేదైనా కారణాలు ఉండివుండొచ్చని సినీ నటుడు డాక్టర్ ఎం. మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ముంబైలో నితిన

సహజనటి జయసుధ భర్త, దర్శక నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్యకు ఆర్థిక కష్టాలు మాత్రం కాదనీ, మరేదైనా కారణాలు ఉండివుండొచ్చని సినీ నటుడు డాక్టర్ ఎం. మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ముంబైలో నితిన్ కపూర్ అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ... 'నాకు దాదాపు 45 సంవత్సరాల నుంచి జయసుధ తెలుసు.. నేను, 30 రూపాయలకు అసోసియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నప్పుడు.. ఆమె హీరోయిన్గా పని చేసింది... ఆ తర్వాత అదే జయసుధ పక్కన హీరోగా నటించాను... ఆమె మహానటి. 
 
మా గురువు గారు దర్శకుడు దాసరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా నితిన్ కపూర్ పనిచేశాడు. బాలీవుడ్ నటుడు జితేంద్రకు కజిన్. నితిన్ కపూర్‌కు నూటికి నూరు మార్కులు వేస్తాను... కరెక్టుగా నాలుగు రోజుల క్రితం మా ఇంటికి వచ్చి భోజనం చేశాడు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగాను... ఆర్థిక పరిస్థితులు కాదు.. వేరే ఏవైనా కావచ్చు. అతని మనసులో ఏదో ఉండొచ్చు.. ఆ కుటుంబానికి నా సంతాపం’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.