శనివారం, 1 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 మే 2016 (11:42 IST)

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2015 లిస్టులో ప్రిన్స్ మహేష్ బాబుకు ఆరోస్థానం!

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2015 జాబితాను విడుదల చేసారు. ఈ జాబితాలో క్రికెటర్‌ ప్లస్ అనుష్క శర్మతో ప్రేమ వ్యవహారం ద్వారా క్రేజ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇక అగ్రస్థానాన్ని రణవీర్ సింగ్ కైవసం చేసుకున్నాడు. ఇక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు కూడా జాబితాలో స్థానం దక్కింది. ఫవాద్ ఖాన్ మూడో స్థానంలోనూ, హృతిక్ రోషన్ నాలుగో స్థానంలోనూ, సిద్ధార్థ్ మల్హోత్రా 5వస్థానంలో నిలవగా, మహేష్ బాబు ఆరో స్థానంలో నిలవడం విశేషం.
 
మహేష్ బాబు క్రేజ్‌ బాలీవుడ్‌ను సైతం కుదిపేసింది. మహేష్ బాబుతో కలిసి నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఎగబడటమే ఇందుకు కారణమని సినీ పండితులు అంటున్నారు. గత ఏడాది మహేష్ బాబు ఇదే స్థానంలో ఉండగా, 2013లో అయితే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో మహేష్ అగ్రస్థానంలో నిలిచి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.