1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (16:02 IST)

దావూద్ ఫోన్‌లో బెదిరిస్తున్నాడండీ బాబోయ్.. పాక్‍‌ నెంబర్ నుంచే కాల్.. అక్కడే ఉన్నాడా?

పాకిస్థాన్‌ దేశానికి చెందిన మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి డాన్ దావూద్ ఇబ్రహీం గత పదిరోజుల్లో ఐదుసార్లు తమకు ఫోన్ చేసి బెదిరించాడని చిత్ర నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము తీస్తున్న ఈ సినిమాకు సంబంధ

పాకిస్థాన్‌ దేశానికి చెందిన మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి డాన్ దావూద్ ఇబ్రహీం గత పదిరోజుల్లో ఐదుసార్లు తమకు ఫోన్ చేసి బెదిరించాడని చిత్ర నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము తీస్తున్న ఈ సినిమాకు సంబంధించి దావూద్ ఫోనులో బెదిరించారని చిత్ర నిర్మాతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
 
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బయోపిక్ 'డి-డే' పేరుతో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ సినిమాలో దావూద్ పాత్రలో బాలీవుడ్ స్టార్ రిషికపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ , హుమా ఖురేషి, శృతి హాసన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14, 2016 నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని సినీ దర్శకుడు విశాల్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ అదే రోజున విడుదలైందని చెప్పారు.