మంగళవారం, 8 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 15 మార్చి 2025 (14:15 IST)

Roshan Kanakala: మోగ్లీ 2025 చిత్రం రోషన్ కనకాల బర్త్ డే పోస్టర్

Roshan Kanakala
Roshan Kanakala
తొలి చిత్రం బబుల్ గమ్‌లో తన నటనతో అలరించిన రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది.
 
ఈ రోజు రోషన్ కనకాల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిర్మాతలు ఒక అద్భుతమైన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇంటెన్స్ లుక్, మెడ గొలుసులా వేలాడుతున్న గద, చేతి చుట్టూ చుట్టబడిన వస్త్రం, అతని పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేస్తుంది. మోగ్లీ 2025 లో అతని పాత్ర యొక్క యాక్షన్-ప్యాక్డ్ స్వభావాన్ని సూచిస్తోంది. 
 
సినిమా గ్లింప్స్ రోషన్‌ను హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో చూపించింది. ఈ చిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా ఆరంగేట్రం చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తుండగా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లేను రామ మారుతి ఎం, రాధాకృష్ణ రెడ్డి రాశారు. మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.