ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (13:04 IST)

రజనీకాంత్"కాలా"లో నా బంగారు తల్లి...కాలా ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫోటోలు..

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్-రంజిత్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో.. వీరిద్దరి కాంబోలో రెండో సినిమా కూడా మొదలైంది. రజనీ-రంజ

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్-రంజిత్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో.. వీరిద్దరి కాంబోలో రెండో సినిమా కూడా మొదలైంది. రజనీ-రంజిత్ కాంబోలో తెరకెక్కి సినిమా టైటిల్ కూడా ఖరారైంది. ఈ సినిమా టైటిల్ 'కాలా' లోగోను సినీ యూనిట్ లాంఛనంగా ఆవిష్కరించింది. రజనీ అభిమానులను ఈ టైటిల్ బాగానే ఆకట్టుకుంది. 
 
రజనీకి అచ్చొచ్చిన మాఫియా నేపథ్యం కావడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్ర కోసం 'అంజలి పాటిల్' ను ఎంపిక చేసినట్టు సమాచారం. తెలుగులో అంజలి పాటిల్ చేసిన 'నా బంగారు తల్లి' సినిమా, ఆమెకు మంచి గుర్తింపులు సంపాదించిపెట్టిన సంగతి తెలిసిందే. సహజమైన నటనను ప్రదర్శించే అంజలి పాటిల్‌కి 'కాలా' సినిమాలో ఎలాంటి రోల్ లభించిందో అనేది తెలియాలంటే వేచి చూడాలి. ఇప్పటికే రజనీ సరసన హుమా ఖురేషి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.