వరలక్ష్మీ ధైర్యంగా చెప్పేసింది.. నేను కూడా లైంగిక దాడికి గురయ్యా: నగ్మా
హీరోయిన్‌గా ప్రస్తుతం రాజకీయ నేతగా రాణిస్తున్న సినీ నటి నగ్మా హీరోయిన్ భావనపై జరిగిన అత్యాచార ఘటన పట్ల స్పందించింది. ఈ ఘటనపై తాను పెద్దగా షాక్ అవనని, ఆశ్చర్యానికి కూడా గురయ్యే ప్రసక్తే లేదని చెప్పింది
హీరోయిన్‌గా ప్రస్తుతం రాజకీయ నేతగా రాణిస్తున్న సినీ నటి నగ్మా హీరోయిన్ భావనపై జరిగిన అత్యాచార ఘటన పట్ల స్పందించింది. ఈ ఘటనపై తాను పెద్దగా షాక్ అవనని, ఆశ్చర్యానికి కూడా గురయ్యే ప్రసక్తే లేదని చెప్పింది. తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాయని చెప్పింది.
కానీ తాను మాత్రం ఇప్పటిదాకా బయటకు చెప్పుకోలేదని.. వరలక్ష్మి మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి.. విషయాన్ని బట్టబయలు చేసిందని ప్రశంసించింది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ రాజకీయ నాయకుడు, నటుడు కావడంతో... ఆమె ధైర్యంగా బయటకు చెప్పగలిగిందని తెలిపింది. కానీ, చాలామంది ఇలాంటి అఘాయిత్యాలపై మాట్లాడటానికి జడుసుకుంటున్నారని చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా చోటుచేసుకున్న భావన ఘటనపై నగ్మా స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు ప్రపంచం మొత్తం జరుగుతున్నాయని.. హాలీవుడ్‌లో సైతం ఇలాంటి విషయాలు జరుగుతుంటాయని తెలిపింది. మన దేశ సినిమా రంగానికి కూడా ఇలాంటి వేధింపులు కొత్త కాదని... మన దేశ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని నగ్మా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతీ మహిళ తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు వేధింపులకు గురవుతోందని తెలిపింది.