మంచి కథల కోసం ఎదురుచూస్తున్నా.. అలాంటి మాటల్ని నమ్మొద్దు: నందిత రాజ్
తెలుగు తెరపై మెరిసిన అచ్చమైన తెలుగు అందం నందిత.. తేజ దర్శకత్వం వహించిన 'నీకు నాకు' చిత్రంతో ఆమె పరిచయమైంది. 'ప్రేమకథా చిత్రమ్', 'లవర్స్' వంటి సినిమాల్లో విజయాలు అందుకుంది. అందంతో పాటు, నటిగా కూడా ని
తెలుగు తెరపై మెరిసిన అచ్చమైన తెలుగు అందం నందిత.. తేజ దర్శకత్వం వహించిన 'నీకు నాకు' చిత్రంతో ఆమె పరిచయమైంది. 'ప్రేమకథా చిత్రమ్', 'లవర్స్' వంటి సినిమాల్లో విజయాలు అందుకుంది. అందంతో పాటు, నటిగా కూడా నిరూపించుకొన్నప్పటికీ నందితకి ఆశించినస్థాయిలో అవకాశాలు దక్కలేదు. అయినా ఆమె తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఇటీవల ఆమెపై ఓ ప్రచారం మొదలైంది.
నందితకు సినిమాలు చేయదట అని మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఆ ప్రచారం తనదాకా చేరడంతో నందిత స్పందించింది. అలాంటి మాటల్ని ఎవ్వరూ నమ్మొద్దు. తాను పరిశ్రమకి అందుబాటులోనే ఉన్నానని చెప్పింది. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నా. ఇకపై కూడా నటిస్తూనే ఉంటానని తెలిపింది. ఇకపోతే.. నందిత ఐదు అడుగుల 3 ఇంచ్‌ల ఎత్తున.. 51కేజీల బరువుతో కలిగివున్న నందిత రాజ్ ప్రస్తుతం అవకాశాల కోసం వేచిచూస్తుంది.