ఉగాది పర్వదినాన అంజన పండంటి మగబిడ్డ పుట్టాడోచ్.. నాని తండ్రి అయ్యాడోచ్..
ఉగాది పర్వదినాన హీరో నాని సతీమణి అంజన పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. తద్వారా ఈగ హీరో నాని తండ్రి అయ్యాడు. ఉగాది రోజున ఆయనకు తండ్రి అనే ప్రమోషన్ వచ్చిందని నాని పీఆర్వో మహేష్ కోనేరు ట్విటర్ ద్వారా తె
ఉగాది పర్వదినాన హీరో నాని సతీమణి అంజన పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. తద్వారా ఈగ హీరో నాని తండ్రి అయ్యాడు. ఉగాది రోజున ఆయనకు తండ్రి అనే ప్రమోషన్ వచ్చిందని నాని పీఆర్వో మహేష్ కోనేరు ట్విటర్ ద్వారా తెలుపుతూ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అంజన మగ శిశువుకు జన్మనిచ్చారని మహేష్ తెలిపారు.
2012లో నాని, అంజన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని.. షూటింగ్ పనుల కారణంగా విదేశానికి వెళ్లి స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. నానికి పెళ్లై ఐదేళ్లైన నేపథ్యంలో.. తాజాగా నిన్ను కోరి సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. శివ నిర్వాన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.