మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (15:56 IST)

మలయాళ ప్రముఖ నటుడు నెడుముడి వేణు ఇకలేరు..

మలయాళ చిత్రపరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నెడుముడి వేణు సోమవారం మరణించారు. ఆయనకు 73 ఏళ్లు. 
 
గత కొన్ని రోజులుగా తిరువనంతపురంలోని  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్‌ సంబంధిత వ్యాధి చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. 
 
నెడుముడి వేణు కెరీర్‌ విషయానికొస్తే ఈయన తన నటనా ప్రస్థానాన్ని చిన్న థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. ఇక 1978లో జీ అరవిందన్‌ దర్శకత్వంలో వచ్చిన థంబు చిత్రంలో వేణు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. 
 
తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈయన తన అద్భుత నటనతో మూడు జాతీయ అవార్డుతో పాటు ఏడు రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించుకున్నారు. నెడుముడి మరణంపై పలువురు సినీ నటునటులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.