మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (14:21 IST)

శ్రీదేవికి జాతీయ అవార్డు.. మామ్‌‌ సినిమాకు ఉత్తమనటిగా అతిలోకసుందరి

దివికేగిన అతిలోక సుందరి.. శ్రీదేవికి జాతీయ అవార్డు దక్కింది. శ్రీదేవి చివరి సినిమా అయిన ''మామ్''లో శ్రీదేవి అత్యుత్తమ నటనను వెలిబుచ్చారు. దీంతో ఆమె నటనకు గాను ఉత్తమ అవార్డు దక్కింది. ఫిబ్రవరిలో దుబాయ్

దివికేగిన అతిలోక సుందరి.. శ్రీదేవికి జాతీయ అవార్డు దక్కింది. శ్రీదేవి చివరి సినిమా అయిన ''మామ్''లో శ్రీదేవి అత్యుత్తమ నటనను వెలిబుచ్చారు. దీంతో ఆమె నటనకు గాను ఉత్తమ అవార్డు దక్కింది. ఫిబ్రవరిలో దుబాయ్‌కి తన అల్లుడు వివాహానికి వెళ్లిన శ్రీదేవి.. దుబాయ్ హోటళ్లోని బాత్‌టబ్‌లో మునిగి దురదృష్టవశాత్తు మృతి చెందింది.
 
శ్రీదేవి మరణంతో ఆమె అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. కానీ శ్రీదేవి నటించిన ''మామ్'' సినిమాకుగాను అతిలోకసుందరికి ఉత్తమ నటి అవార్డు దక్కడంపై శ్రీదేవి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళినా.. ఆమె నటన చిరస్థాయిగా నిలిచిపోతుందనేందుకు ఇదో నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన జక్కన్న బాహుబలికి అత్యుత్తమ యాక్షన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కొరియో గ్రాఫీ అవార్డులు దక్కాయి.