ట్రాన్స్జెండర్ గా నవాజుద్దీన్ సిద్దికి రివెంజ్ డ్రామా హడ్డి
నవాజుద్దీన్ సిద్దికి, అనురాగ్ కశ్యప్ నటించిన రివెంజ్ డ్రామా హడ్డి సినిమా జీ 5 లో ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది. జీ స్టూడియోస్, సంజయ్ సాహా, రాధికా నందా ఆనందిత స్టూడియోస్ చే నిర్మించబడిన ఈ సినిమా అక్షత్ అజయ్ శర్మచే దర్శకత్వం వహించారు. ZEE5 పై సెప్టెంబర్ 7, 2023 నుండి ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది అని ఒక ప్రకటనలో తెలిపారు.
ట్రాన్స్జెండర్ గా నవాజుద్దీన్ సిద్దికి పాత్రతో మైమరచిపోయారు. నవాజుద్దీన్ సిద్దికి వెంబడి ఈ రివెంజ్ డ్రామాలో ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించారు. వీరితో పాటు ఇలా అరుణ్, మొహమ్మద్ జీషాన్ అయ్యుబ్, సౌరభ్ సచ్దేవ, శ్రీధర్ దుబే, రాజేష్ కుమార్, విపిన్ శర్మ మరియు సహర్ష్ శుక్ల ఇతర కీలక పాత్రలలో నటించారు. జీ స్టూడియోస్ మరియు ఆనందిత స్టూడియోస్ చే నిర్మించబడిన ఈ హడ్డీ చిత్రము ZEE5 పై ప్రీమియర్ గా ప్రసారమయ్యే ఒక క్రైమ్ ప్రతీకార నాటకం.
ఎన్సిఆర్, గురుగావ్, నోయిడాలోని ఆధునిక శిథిలాల నేపథ్యములో చిత్రీకరించబడిన ఈ చిత్రము ప్రేక్షకులను ప్రతీకార రైడ్ చేయిస్తుంది మరియు నవాజుద్దీన్ సిద్దికి పోషించిన ఒక ట్రాన్స్జెండర్ పాత్ర హడ్డీ జీవితాన్ని పరిశోధిస్తుంది. ఇతను ట్రాన్స్జెండర్స్ వర్గములో చేరటానికి అలహాబాద్ నుండి ఢిల్లీకి వస్తాడు మరియు తన కుటుంబానికి అన్యాయం చేసిన ఒక రాజకీయనాయకుడిగా మారిన ఒక నేరస్థుడు-అనురాగ్ కశ్యప్ నటించారు- పై ప్రతీకారం తీర్చుకొనుటకు ఒక నేరస్థుడిగా మారతాడు. అక్షత్ అజయ్ శర్మ మరియు అదమ్య భల్లాచే సహ-రచన చేయబడిన ఈ “హడ్డి” ఒక పట్టుదల ఉన్న మరియు ఎన్నో మలుపులు ఉన్న ప్రతీకార డ్రామా. ఇది రాజధానిలో జరుగుతున్న నేరాల క్లిష్టమైన అనుబంధాన్ని నేర్పుగా బహిర్గతం చేస్తుంది.
నవాజుద్దీన్ సిద్దికి మాట్లాడుతూ , “నేను ఒక ట్రాన్స్జెండర్ పాత్ర పోషిస్తున్నాను అనే తలంపే నాకు రాలేదు. నేను ఎప్పుడు అది ఒక స్త్రీ పాత్ర అనే అనుకున్నాను, ఎందుకంటే ప్రతి ట్రాన్స్జెండర్ స్త్రీ సంపూర్ణ స్త్రీగా ఉండాలని కోరుకుంటుంది. చిత్రీకరణకు ముందు నేను ట్రాన్స్జెండర్ సంఘాలతో కలిసి ఉన్నాను మరియు సంపూర్ణ స్త్రీత్వాన్ని స్వీకరించాలనే వారి కోరికను అర్థంచేసుకున్నాను. ఈ పాత్రను నేరుగా పోషించడం కంటే నేను ఒక స్త్రీ పాత్రను అభినయించాలని ఈ అనుభవం నాకు ఒక అమూల్యమైన పాఠం నేర్పింది. ఇది ఒక సవాలు అని మరియు ఇందులో రెండు లేదా మూడు గంటల మేకప్ అవసరం ఉంటుందని, ఒకేరోజు మరొక పాత్రకు మారవలసి ఉంటుందని తెలిసి నేను చాలా శ్రద్ధగా సిద్ధం అయ్యాను ” అన్నారు.
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ,“నేను అక్షత్ మరియు హడ్డీ చిత్రం చిత్రీకరణలో అతని కృషికి గర్విస్తున్నాను. అక్షత్ నాకు ఒక ఏడి (అసిస్టెంట్ డైరెక్టర్) గా చాలా సంవత్సరాలు సహాయం చేశారు మరియు దర్శకుడిగా అతని మొదటి చిత్రములో ఒక నటుడిగా నాకు అవకాశం రావడం నా అదృష్టం. హడ్డి ఒక క్రూరమైన, ఉద్రేకపూరితమైన, పగతో నిండిన డ్రామా, మరియు ఇదివరకు మీరు ఎన్నడు చూడని ఒక చిత్రము. అలాగే, ఈ గుర్తించలేనిది అయినా కదిలించే ఒక పాత్రలో నవాజ్ ను ఫ్యాన్స్ ఇష్టపడతారు. ఎందుకంటే మరొకసారి అతను తనను తాను నిరూపించుకున్నాను. ZEE5 పై హడ్డీ విడుదల నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది మరియు ప్రేక్షకులు ఈ క్రైమ్ ప్రతీకార నాటకాన్ని వీక్షింస్తారని ఆశిస్తున్నాను.”.అన్నారు.