ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (17:44 IST)

వెంకటేష్ సైంధవ్ లో కీలక పాత్ర పోషిస్తున్న హీరో ఆర్య

hero Arya
hero Arya
వెంకటేష్‌ 75 మైల్ స్టోన్ మూవీ ‘సైంధవ్‌’ ని మెమరబుల్ గా చేయడానికి భారీ తారాగణం ,అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. హిట్‌వర్స్ ఫేమ్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 8 మంది కీలక నటీనటుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇప్పటివరకు 7 పాత్రలను పరిచయం చేశారు. ఈరోజు సినిమాలోని మరో కీలక పాత్రను రిలీవ్ చేశారు.
 
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ ఆర్య ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రను మానస్‌గా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫార్మల్ దుస్తుల్లో స్లిక్, స్టైలిష్ లుక్‌తో చేతిలో మెషిన్ గన్‌తో ఫెరోషియస్ గా   కనిపిస్తున్నారు ఆర్య.
 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ నిమాలోని ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఒక  గ్లింప్స్ విడుదల చేశారు. వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ వీడియోలో కనిపించారు.
 
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
 
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా