శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (16:52 IST)

నాన్ స్టాప్'గా ఎంటర్'టైన్ చేసే చిత్రం నేను - కీర్తన : హీరో, దర్శకుడు చిమటా రమేష్ బాబు

Director Chimata Ramesh Babu
Director Chimata Ramesh Babu
చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ... "నేను - కీర్తన" చిత్రం కోసం నేను ఎంతగానో శ్రమించాను. దర్శకుడిగా హీరోగా నా శ్రమకు తగ్గ ఫలితం లభించి, చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. రెండున్నర గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేసే మల్టీ జోనర్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు. 
 
రిషిత, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)