''కబాలి'' ప్రమోషన్‌కు దూరమయ్యా: క్షమాపణలు చెప్పిన రాధికా ఆప్టే!
ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో నటించి సినిమా పూర్తవ్వగానే పక్కకు తప్పుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన ఎటువంటి ఫంక్షన్‌లో పాల్గొనకుండా పక్కకు తప్పుకోవడం చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఆ జాబితాలో
ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో నటించి సినిమా పూర్తవ్వగానే పక్కకు తప్పుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన ఎటువంటి ఫంక్షన్‌లో పాల్గొనకుండా పక్కకు తప్పుకోవడం చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఆ జాబితాలో మొదటి స్థానం మళయాళ ముద్దుగుమ్మ నయన తార దక్కించుకుంది. ఇప్పుడు రెండోస్థానంలో రాధికా ఆప్టే చేరిపోయింది.
అసలు విషయం ఏంటంటే.. తాజాగా విడుదలైన రజనీకాంత్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రాధికా ఆప్టే కూడా కబాలి చిత్ర ప్రమోషన్‌లో పాల్గొనక పోవడమే ఇందుకు ముఖ్య కారణం. దీంతో ఆమెపై విమర్శలు తలెత్తాయి. అయితే ఈ విషయంపై రాధికా తనదైన శైలిలో స్పందించింది.
కబాలి సినిమా విడుదల తేదీని అనుకోకుండా ప్రకటించారని, ప్రమోషన్ లో పాల్గోనలేకపోవడం చాలా బాధాకరమని, ఆ సమయంలో తాను వేరే సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నానని రాధికా తెలిపింది. ఇందుకు క్షమాపణలు కూడా చెప్పింది. తాను నటించిన చిత్రాల్లో కబాలి ఒక మంచి చిత్రమని, అందులో నటించడం చాలా సంతోషకరమని.... సినిమా మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.