ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (02:47 IST)

మన బాలుకు మన నందమూరి అవార్డు.. ఇంత ఆలస్యంగానా..!

ఘంటసాల తర్వాత తెలుగు చలనచిత్రసీమలోనే కాకుండా యావద్భారతంలోనూ వివిధ భాషలలో పాటలతో కోట్లమంది మనస్సులను రంజింపచేస్తున్న మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నందమూరి తారకరామారావు జాతీయ అవార్డును 2012 సంవత్సరానికి గాను ప్రకటించారు. అయిదేళ్ల ఆలస్యంగా అయినా సరే ఈ విశి

ఘంటసాల తర్వాత తెలుగు చలనచిత్రసీమలోనే కాకుండా యావద్భారతంలోనూ వివిధ భాషలలో పాటలతో కోట్లమంది మనస్సులను రంజింపచేస్తున్న మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నందమూరి తారకరామారావు జాతీయ అవార్డును 2012 సంవత్సరానికి గాను ప్రకటించారు. అయిదేళ్ల ఆలస్యంగా అయినా సరే ఈ విశిష్ట అవార్డును 
మన బాల గంధర్వుడికి ప్రకటించడం ముదావహం.
 
2012-13 సంవత్సరానికి తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు పురస్కారంగా లభించే నటరత్న నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు (2012)కు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.
 
ఇక 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన చలనచిత్ర అవార్డులను త్వరలో ప్రకటిస్తామని నటుడు మురళీమోహన్‌ తెలిపారు. అలాగే ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ఘనంగా ప్రదానం చేస్తామన్నారు. ఈ అవార్డులను ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ప్రకటించారు.
 
2012 జాతీయ అవార్డులు
బీఎన్‌ రెడ్డి అవార్డు-సింగీతం శ్రీనివాసరావు
నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు-దగ్గుబాటి సురేష్‌
రఘుపతి వెంకయ్య అవార్డు- కోడి రామకృష్ణ
 
2013 జాతీయ అవార్డులు
ఎన్టీఆర్‌ అవార్డు-హేమమాలిని
బీఎన్‌ రెడ్డి అవార్డు-కోదండరామిరెడ్డి
నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు- దిల్‌ రాజు
రఘుపతి వెంకయ్య అవార్డు- వాణిశ్రీ