బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 4 మే 2016 (10:20 IST)

జనతా గ్యారేజ్: ముంబైలో భారీ యాక్షన్ సీక్వెన్స్.. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫైట్‍‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత నిత్య మీనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఇక్కడ ఎన్టీఆ‌ర్‌తో కొరటాల శివ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చేయిస్తున్నాడట. 
 
ఈ షెడ్యూల్‌లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కొరటాల తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది ఎన్టీఆర్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫైట్‌గా నిలుస్తుందని కొరటాల అంటున్నాడు. గతంలో రిలీజైన 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో.. భారీ ఫైట్స్ ఏమి లేదు. దీంతో మాస్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఈ సినిమాతో ఆ లోటు తీర్చేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట.
 
ఫైట్ మాస్టర్ అణల్ అరసు ఈ ఫైట్‌ను అత్యంత భారీగా తెరకెక్కించనున్నాడు. ఈ భారీ ఫైట్‌ని ఈ నెల 15 నుండి యూనిట్ సభ్యులు మొదలు పెట్టనున్నారట. అలాగే కొరటాల శివ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఓ రేంజ్‌లో చూపించడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాడట. ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ గత చిత్రాల కంటే డిఫరెంట్ స్టైల్‌లో కనిపించాడానికి ప్రయత్నిస్తున్నాడట.