శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (05:53 IST)

"ఓం నమో వెంకటేశాయ" చిత్రమే చివరి సినిమా అవుతుందేమో?: నాగార్జున

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓం నమో వెంకటేశాయ' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, దర్శకుడు రాఘవేంద్రరా

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓం నమో వెంకటేశాయ' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, దర్శకుడు రాఘవేంద్రరావు, కీరవాణి, అనుష్క, ప్రజ్ఞ జైశ్వాల్, దిల్ రాజు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ప్రసంగించిన నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు కన్నీటి పర్యంతమయ్యారు. తాను వెంకటేశ్వర స్వామిని మూడు కోర్కెలు కోరుకున్నానని, అన్నింటినీ ఆయన తీర్చాడని చెప్పారు. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చూడలేక స్వామీ తీసుకెళ్లిపో అని ప్రార్థించానని, కొన్ని గంటల్లోనే ఆమె కన్నుమూశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
 
అలాగే, నాన్నగారి ఆఖరి మూవీ 'మనం' సినిమా హిట్ కావాలని మనసారా ప్రార్థించానని, మూవీ సూపర్ హిట్ అయ్యిందని చెప్పారు. మంచి కుటుంబాన్ని ఇచ్చావు ఇద్దరు పిల్లల్ని చల్లగా చూడు తండ్రి అని వేడుకున్నా, తిరుపతిలో ఉన్నప్పుడు తన ఇద్దరి పిల్లల పెళ్లి గురించి తెలిసిందని చెప్పారు. అయితే స్వామి తన కోర్కెలు నెరవేర్చుతున్న కొద్ది తన కోర్కెల చిట్టా పెరిగిపోతుందని నాగ్ చెప్పుకొచ్చారు. శ్రీనివాసుడు ఎప్పుడూ నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంటుంది. శ్రీరామదాసు, అన్నమయ్య, శిరిడిసాయి, ఇప్పడు 'ఓం నమో వెంకటేశాయ'లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా'' అని వివరించారు.
 
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి, నాకు ఇదే చివరి సినిమా అవుతుందేమో తెలియదు కానీ...'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కానీ ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని నాగార్జున చెప్పారు.