గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:52 IST)

ప్రభాస్‌ను వెనక్కి నెట్టిన కోలీవుడ్ హీరో... ఎవరు?

Dalapathy Vijay
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్‌ను కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ వెనక్కి నెట్టేశారు. మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో విజయ్ అగ్రస్థానంలో నిలించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సంస్థ తాజాగా మోస్ట్ పాపురల్ జాబితాను విడుదల చేసింది. ఇందులో విజయ్ అగ్రస్థానంలో నిలిచారు. 
 
సెప్టెంబరు నెలలో అత్యంత ప్రేక్షకాదారణ పొందిన హీరో హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. ఇందులో తమిళ హీరో విజయ్ అగ్రస్థానంలో నిలువగా, ప్రభాస్ రెండో స్థానంలో నిలిచారు. కాగా, విజయ్‌ ఇటీవల 'గోట్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వస్తుండటంతో అభిమానులు, సినీ ప్రేక్షకుల ఆయన గురించి తెగ వెతికేస్తున్నారు. దీంతో ఆయన టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. ప్రభాస్‌ 'కల్కి'తో పాటు హనురాఘవపూడి మూవీలతో ట్రెండ్‌లో నిలిచారు.
 
ఇకపోతే, హీరోయిన్ల జాబితాలో టాప్‌లో సమంత నిలిచారు. రెండో స్థానాన్ని ‘జిగ్రా’తో పలకరించిన అలియాభట్‌ సొంతం చేసుకున్నారు. ఇక సమంత గత కొన్ని రోజులుగా ‘సిటాడెల్‌: హనీ బన్ని’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలతో వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన విశేషాలు పంచుకుంటున్నారు. దీంతో నటీమణుల జాబితాలో టాప్ ప్లేస్‌కు వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో షేర్‌ అవుతుండగా.. అభిమానులు ఖుష్ అవుతున్నారు.  
 
ఈ జాబితాలో టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోల పేర్లను వరుసగా పరిశీలిస్తే, విజయ్, ప్రభాస్, షారూక్ ఖాన్, అజిత్ కుమార్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్‌లు ఉండగా, హీరోయిన్ల జాబితాలో సమంత, అలియా భట్, దీపికా పదుకొణె, నయనతార, త్రిష, శ్రద్ధాకపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక, కియారా అద్వానీలు ఉన్నారు.