మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (10:15 IST)

'పద్మావత్' ప్రివ్యూ రిపోర్ట్ : ఓ అద్భుతమంటూ ప్రశంసలు

బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'పద్మావత్'. ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుని సుప్రీంకోర్టు జోక్యంతో ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ప్రివ్

బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'పద్మావత్'. ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుని సుప్రీంకోర్టు జోక్యంతో ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ప్రివ్యూ చూసిన పలువురు ప్రముఖులు ఇది ఓ అద్భుత చిత్రమని అభిప్రాయపడుతున్నారు. 
 
దీపిక కళ్లతోనే అద్భుతం చేసిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమెతో పాటు షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్‌లు చాలా బాగా నటించారని స్టార్ హీరో హృతిక్ రోషన్ పొగడ్తలు గుప్పించాడు. ఎన్ని వివాదాలు వచ్చినా సినిమా గొప్ప సక్సెస్‌ను కళ్ల జూడనుందని బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 
 
ముఖ్యగా, రాజ్‌పుత్ వంశీయుల చరిత్రను ఈ చిత్రం గొప్పగా చూపించారనీ, ఎక్కడా కూడా అశ్లీల, అసభ్య సన్నివేశాలు మచ్చుకైనా లేవని వారు కొనియాడారు. పైగా, రాజ్‌పుత్ వర్గం మహిళలను కించపరిచేలా ఎలాంటి సన్నివేశాలూ లేవని భరోసాను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూసేలా చిత్రం ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని కితాబిస్తున్నారు.