బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (14:04 IST)

భారతీయ చిత్రాల వల్లే అత్యాచారాలు : పాకిస్థాన్ యూత్

భారతీయ చిత్ర పరిశ్రమ(బాలీవుడ్) వల్లే తమ దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని పాకిస్థాన్ యూత్ ఆరోపిస్తోంది. అంతేనా, అత్యాచారాలు జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాల విశ్లేష‌ణ అక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

భారతీయ చిత్ర పరిశ్రమ(బాలీవుడ్) వల్లే తమ దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని పాకిస్థాన్ యూత్ ఆరోపిస్తోంది. అంతేనా, అత్యాచారాలు జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాల విశ్లేష‌ణ అక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందులో భాగంగా #StopVulgarityOnMedia అనే హ్యాష్‌ట్యాగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
 
ఇటీవల జైనాబ్ అనే 7 ఏళ్ల పాకిస్థాన్ బాలికపై అత్యాచారం జరిపి, హ‌త్య చేసి శవాన్ని రోడ్డుమీద ప‌డేశారు. ఈ ఘటన సంచలనమైంది. ఈ సంఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా పాకిస్థాన్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ సినిమాలు, టీవీ కార్య‌క్ర‌మాల్లో చూపించే అసభ్య స‌న్నివేశాల కార‌ణంగా పాక్ యువ‌త ప్ర‌భావిత‌మ‌వుతోందని నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా, తమ దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు ప్రధాన కారణం బాలీవుడ్ సినిమాలేన‌ని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే బాలీవుడ్ సినిమాలు, భార‌తీయ సీరియ‌ళ్లు, టీవీ షోలపై నిషేధం విధించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ సంస్కృతిలో అశ్లీల‌త భాగం కాద‌ని, టెలివిజ‌న్ కంటెంట్ పేరుతో అస‌భ్య‌త‌ను సంస్కృతిలో భాగం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.