శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2020 (17:20 IST)

అల్లు అర్జున్ పరుగు హీరోయిన్ షీలా పెళ్లయిపోయింది

షీలా పెళ్లి
అల్లు అర్జున్ సరసన పరుగు చిత్రంలో నటించిన హీరోయిన్ షీలా వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఓ మోస్తరు సక్సెస్ లో వుండగానే నటి షీలా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె చెన్నైలోని ఈవీపి ఫిల్మ్ సిటీ చైర్మన్ సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. 
వీరి వివాహం మార్చి 12న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక ఫోటోలను షీలా తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. కాగా షీలా కౌర్ 2006లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన రాజు భాయ్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు.