పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేష్.. ఎందుకో తెలుసా?
ప్రముఖ తెలుగు నటుడు, విజయ నిర్మల కుమారుడు నరేష్‌ను పవిత్రా లోకేష్ రహస్యంగా వివాహం చేసుకున్నారని కొంత మంది... వాళ్లిద్దరూ సహ జీవనం చేస్తున్నారని మరి కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికి తోచింది వారు పోస్టులు చేస్తుండటంతో ఈ విధంగా పవిత్రా లోకేష్ స్పందించారు. నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి విషయం కన్నడనాట కూడా హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా సోషల్ మీడియాలో తన పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడంతో పాటు తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు చేస్తున్నారని కర్ణాటకలోని మైసూర్‌లో సైబర్ క్రైమ్ పోలీసులకు పవిత్రా లోకేష్ కంప్లైంట్ చేశారు.
అలాగే, తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవిడ ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు.