బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 19 జూన్ 2017 (16:56 IST)

పవన్ కళ్యాణ్ గడ్డి పీక్కోవడం చూశానంటున్న నటుడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పగానే మెగా ఫ్యామిలీలో ఓ డిఫరెంట్ వ్యక్తి అని చెప్పుకుంటుంటారు. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడైన పవన్ కళ్యాణ్ స్వయంగా చిరంజీవి గురించి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా ఎందుకో ఆయనకీ ఈయనకీ మధ్య ఏదో తేడా వుందని అ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పగానే మెగా ఫ్యామిలీలో ఓ డిఫరెంట్ వ్యక్తి అని చెప్పుకుంటుంటారు. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడైన పవన్ కళ్యాణ్ స్వయంగా చిరంజీవి గురించి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా ఎందుకో ఆయనకీ ఈయనకీ మధ్య ఏదో తేడా వుందని అనుకుంటుంటారు ఆయన అభిమానులు. అదేమీ లేదని పవన్ చాలాసార్లు స్పష్టం చేశారు. అలాగే చిరంజీవి కూడా. 
 
ఇకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఎవరిని అడిగినా... అంటే ఆయనకు బాగా దగ్గరగా వుండేవారిని కదిలిస్తే నిస్వార్థమైన వ్యక్తి అంటుంటారు. తను ఆర్జించగా వచ్చేదాన్ని అందరికీ పంచుతుంటారని కూడా చెపుతుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సీనియర్ నటుడు రాజా రవీంద్రను కదిలిస్తే... పవన్ గురించి నాకు అంతగా ఏమీ తెలియదు.
 
ఇదివరకు ఎప్పుడైనా మెగాస్టార్ ఇంటికి వెళితే... పవన్ కళ్యాణ్ క్రింద కూర్చుని ఇంట్లో ఎక్కడో వుండేవారు. ఆయనకు భేషజాలు లేవు. ఆయనను చాలాసార్లు తన తోటలో గడ్డి పీక్కుంటూ కూర్చోవడాన్ని చూశాను. చాలా సామాన్యంగా వుండే ఓ పెద్ద నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రాజా రవీంద్ర కొనియాడారు.