మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 17 మే 2016 (17:58 IST)

పవన్‌ ఇచ్చిన డిస్కౌంట్‌... సర్దార్ గబ్బర్‌సింగ్ లాస్ అయినవారికి...

తను తీసిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాస్‌ కావడంతో వారంతా ఆయన్ను కలవడం ఎంతో కొంత ఇస్తానడం జరిగిందే. కాగా, త్వరలో ఎస్‌జె సూర్య దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నాడు. తమిళ 'వీరం' మూలకథ ఆధారంగా రూపొందబోతుం

తను తీసిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాస్‌ కావడంతో వారంతా ఆయన్ను కలవడం ఎంతో కొంత ఇస్తానడం జరిగిందే. కాగా, త్వరలో ఎస్‌జె సూర్య దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నాడు. తమిళ 'వీరం' మూలకథ ఆధారంగా రూపొందబోతుంది. ఈ చిత్రానికి 'సేనాపతి' అనే పేరు కూడా పరిశీలనలో వుంది. ఈ చిత్రాన్ని కూడా పవన్‌ స్నేహితుడు శరద్‌ మరార్‌ నిర్మిస్తున్నాడు. 
 
అయితే.. ఈ సినిమాను మాత్రం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కొన్న డిస్ట్రిబ్యూటర్లే ఇవ్వాలనీ, అది కూడా 25 శాతం తగ్గించి ఇవ్వాలని పవన్‌ నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి నిర్మాత శరద్‌మరార్‌ కూడా అంగీకరించినట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి అనూప్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రుతి హాసన్‌ నాయికగా నటిస్తోంది.