ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జులై 2016 (12:28 IST)

లండన్‌లో పవన్ కళ్యాణ్.. సరికొత్త లుక్ అదుర్స్.. మెలితిప్పిన మీసంతో...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన సరికొత్త లుక్‌తో కనిపించారు. ఇది ఆయన నటించే కొత్త సినిమాలో కనిపించనున్న కొత్త లుక్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన సరికొత్త లుక్‌తో కనిపించారు. ఇది ఆయన నటించే కొత్త సినిమాలో కనిపించనున్న కొత్త లుక్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో పవన్ లండన్ పర్యటనకు వెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ వారికోత్సవాలకి ముఖ్య అతిథిగా పవన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ సరికొత్త లుక్‌తో కనిపించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ బ్లాక్ సూట్‌లో మెలి తిప్పిన మీసంతో దర్శనమిచ్చారు. 
 
గతంలో ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ‘పులి’ సినిమాలో కోర మీసాలతో కనపడిన పవన్ ప్రస్తుత సినిమాలోనే అలాంటి లుక్‌లోనే కనపడనున్నారని వీర లెవెల్లో జరుగుతోంది. అయితే ఇదే ఫైనల్ అంటే ప్రస్తుతానికి అనుమానమే. మొన్నటికి మొన్న తెల్లజుట్టు, క్లీన్ షేవ్‌తో ఓ లుక్‌ను ట్రై చేసినపుడు ఇదే తరహా ప్రచారం జరిగింది. అంచేత ఈ విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం.