పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" ఫస్ట్‌లుక్
పవన్ అభిమానులకు పుట్టినరోజు కానుకగా "హరి హర వీర మల్లు" నుంచి బర్త్ డే గిఫ్టు వచ్చేసింది. పవన్ తాజా చిత్రం "హరి హర వీర మల్లు" నుంచి నిర్మాత ఏఎం రత్నం, ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ కొత్త పోస్టర్ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కి సంబంధించిన అద్భుతమైన లుక్ విడుదలైంది. గడ్డం, సిగ్నేచర్ స్టైల్.. అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చే పోస్టర్ ఇది. "హరి హర వీర మల్లు" చాలా కాలంగా నిర్మాణంలో ఉంది.
ఈ పీరియడ్ డ్రామా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఆలస్యం అవుతున్న తరుణంలో పవన్ లుక్ రావడం ప్రస్తుతం ఫ్యాన్స్‌కు పండగలా మారింది. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. నిధి అగర్వాల్ హీరోయిన్.