శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (14:40 IST)

పవన్ పుస్తకాల పురుగట.. మరి జనాలు మరిచిపోతున్నారా? ఐదు నెలల డెడ్ లైన్ ఎందుకు?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రజలు ప్రస్తుతం అంతగా పట్టించుకోవట్లేదట. రాష్ట్ర విభజన, ఎన్నికల సమయంలో బీజేపీ, తెదేపాకు మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండటంతో పాటు ప్రజల గోడు వ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రజలు ప్రస్తుతం అంతగా పట్టించుకోవట్లేదట. రాష్ట్ర విభజన, ఎన్నికల సమయంలో బీజేపీ, తెదేపాకు మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండటంతో పాటు ప్రజల గోడు వినిపించకపోవడంతో ఆయన్ని ప్రజలు మరిచిపోతున్నారనే టాక్ వస్తోంది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే పవన్ పార్టీ కూడా గాల్లో కలిసిపోతుందంటున్నారు. 
 
ఇంకా పవన్ కల్యాణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని వార్తలు రావడం, బెంజ్ కారు అమ్మేశాడని తెలియరావడంతో డబ్బుల్లేక పవన్ ఇంకేం చేస్తాడులే అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్యాచరణ కొనసాగిస్తుండటంతో..ఇక తాను సీన్లోకి రావడం ఎందుకని..? ఒకవేళ బాబు చేతులెత్తేస్తే ఆ తర్వాత రంగంలోకి దిగి.. కేంద్రంతో తేల్చుకునేందుకు పవన్ సిద్ధమవుతారని సన్నిహితులు అంటున్నారు. 
 
ఇంకా ఐదు నెలల్లోనే గోపాల గోపాల ఫేమ్ డాలీతో తాను చేసే సినిమా పూర్తికావాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డెడ్‌లైన్ ఇచ్చారు. సంక్రాంతికి డాలీ- పవన్ కల్యాణ్- శరత్ మరర్‌- శ్రుతిహాసన్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా పూర్తి కావాలని పవన్ డెడ్ లైన్ ఇచ్చినట్లు తెలిసింది. ఆగస్టు 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త అవతారం ఎత్తనున్న పవన్ కల్యాణ్ తాజా సినిమా హైదరాబాద్ రూరల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. 
 
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం షూటింగ్‌‍లో బిజీగా ఉన్న పవన్ గురించి.. ప్రముఖ రచయిత సత్యానంద్ కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ షూటింగ్‌లోనైనా సరే, ఇంట్లో ఖాళీ దొరికినా సరే ఓ పుస్తకం పట్టుకుని ఓ మూలన కూర్చుని చదువుతూ కనిపించేవాడని సత్యానంద్ తెలిపారు. గతంలో తాను చిరంజీవి వద్దకు కథా చర్చల కోసం వెళ్లిన సమయంలో ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని పవన్ పుస్తకాలు చదివేవాడని.. తాను పలకరిస్తే మాట్లాడేవాడని.. పుస్తకాల గురించి చర్చ మొదలుపెడితే ఎంతో ఆసక్తిగా వినేవాడని సత్యానంద్ తెలిపారు.
 
పవన్ కళ్యాణ్‌కి 17 ఏళ్ల వయసు నుంచే పుస్తకాలంటే పిచ్చని, ఆయనో పుస్తకాల పురుగు అంటూ సత్యానంద్ చెప్పారు. కొత్త పుస్తకాలు వచ్చాయని తెలిస్తే మా ఇంటికి వచ్చేసేవారని వెల్లడించారు. కాగా గుంటూరు శేషేంద్ర వర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని ఇప్పటికే పవన్ కల్యాణ్ చదివేసిన సంగతి తెలిసిందే.

కానీ అంత మంచి పుస్తకం ప్రస్తుతం యువతకు అందుబాటులో లేకపోవడంతో ఆ బుక్‌ను పవన్ రీప్రింట్ చేయిస్తున్నారు. పుస్తకాలు చదివే ఆసక్తి ఏమోకానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు పవన్ ఏమేరకు స్పందిస్తాడో.. తన జనసేన పార్టీని ఎన్నికలకు ఏవిధంగా తయారు చేస్తాడో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.