శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (12:33 IST)

అన్నయ్య సక్సెస్ కావాలని తమ్ముడు కోరుకుంటున్నాడు.. శరత్ మరార్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఖైదీ, శాతకర్ణి పోటీపై చిరంజీవి స్పందించారు. పోటీ అనేది తనకు లేనే లేదన్నారు. తన 150వ సినిమా అప్పుడు బాలకృష్ణ 100వ సిని

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఖైదీ, శాతకర్ణి పోటీపై చిరంజీవి స్పందించారు. పోటీ అనేది తనకు లేనే లేదన్నారు. తన 150వ సినిమా అప్పుడు బాలకృష్ణ 100వ సినిమా 'శాతకర్ణి' కుదరడం అనేది కాకతాళీయమని తెలిపాడు. పోటీపడి తాము ఈ పని చేయలేదు. రిలీజ్‌ టైమ్‌ ఒకేసారి కావడంతో మీడియా క్రియేట్‌ చేసిన పోటీ ఇది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. 
 
కాగా, చిరంజీవి 150వ సినిమా ఖైదీనెం150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ గుంటూరు హాయ్ లాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫంక్షన్‌కు తమ్ముడు పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టడం ఖాయమైంది. పవన్ పక్కా వస్తాడని భావించిన ఈ ఫంక్షన్‌కు చివరినిమిషంలో హ్యాండ్ ఇవ్వడానికి అసలు కారణం తెలిసొచ్చింది. 
 
షూటింగ్ ఉండటం పెద్ద అడ్డంకి కాదని.. అన్నయ్య ప్రతిష్టాత్మక సినిమాలో ఫ్యాన్స్ ఫోకస్ అంతా చిరంజీవిపైనే ఉండాలని భావించి రాలేదని.. తాను కార్యక్రమానికి హాజరైతే ఫోకస్ డివైడ్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫంక్షన్‌కు హాజరుకాకూడదనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని పవన్ క్లోజ్ ఫ్రెండ్.. కాటమరాయుడు నిర్మాత, శరత్ మరార్ తన ట్విట్టర్ ఖాతో ట్వీట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా భారీ సక్సెస్ కావాలని పవన్ కోరుకుంటున్నట్లు శరత్ మరార్ వెల్లడించారు.