మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (17:47 IST)

నన్ను ఆ సినిమాలో ఆంటీలా చూపించారు.. పాయల్

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారును బాగా ఆకట్టుకుంది. హాట్ హాట్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లతో అదరగొట్టింది. అయినప్పటికీ ఆమెకు హీరోయిన్ అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయి. అందుకు కార‌ణం ‘వెంకీమామ‌’ సినిమా డైరెక్ట‌ర్ బాబీ అని పాయ‌ల్ త‌న సన్నిహితుల ద‌గ్గ‌ర వాపోతుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 
 
వెంకీమామ చిత్రంలో సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ స‌ర‌స‌న జోడి క‌ట్టిన పాయ‌ల్‌ను టీచ‌ర్ పాత్ర‌లో చూపించారు. ఆ పాత్ర‌ను ఆంటీలా చూపించార‌ని.. అందుక‌నే ఇప్పుడు కుర్ర హీరోలెవ‌రు త‌న‌తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపడం లేద‌ని బాధ‌ప‌డుతుందట పాయల్. ఆ పాత్రను ఇంకాస్త బెటర్‌గా చూపించివుండవచ్చునని ఆమె బాధపడుతున్నట్లు సమాచారం.