1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (10:57 IST)

రూ.1.65 కోట్ల దుర్వినియోగం.. శరత్ కుమార్‌, రాధారవిపై చీటింగ్, క్రిమినల్ కేసు?

తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ నటుడు శరత్ కుమార్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన కారు నుంచి కొద్ది రోజుల క్రితం తొమ్మిది లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన విదితమే.

తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ నటుడు శరత్ కుమార్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన కారు నుంచి కొద్ది రోజుల క్రితం తొమ్మిది లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన విదితమే.
 
తాజాగా నడిగర్‌ సంఘంలో రూ.1.65 కోట్ల మేరకు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆ సంఘం మాజీ అధ్యక్షుడు, నటుడు శరతకుమార్‌, మరో నటుడు రాధారవిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షుడు నాజర్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
నడిగర్‌ సంఘం ట్రస్టులోని నిధులను శరతకుమార్‌, రాధారవి కలిసి దుర్వినియోగం చేశారని, గత మార్చి 3 తేదీన తాను నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని నాజర్‌ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరుపనున్నారు. కాగా వీరిపై చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదు కానున్నట్లు తెలిసింది.