గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (19:38 IST)

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

Pottel
Pottel
పొట్టేల్ మూవీ అక్టోబర్ 25న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. తాజాగా మూవీ మేకర్స్ పొట్టేల్ ట్రైలర్ అక్టోబర్ 18న సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తారు. ఇంకా పోస్టర్ కూడా రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల, చంద్ర కృష్ణ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్ మోత్కురి దర్శకత్వం వహిస్తుండగా.. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. 
 
అయితే ఈ సినిమాని నైజాం రీజియన్‌లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్ విడుదల చేస్తుంది. దీంతో పొట్టేల్ సినిమా యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా నటి అనన్య, హీరో యువచంద్ర, నోయేల్ సీన్ తదితరులు విమానంలో కొంతమేర డిఫరెంట్‌గా ప్రచారం చేశారు. 
 
ఈ క్రమంలో విమానంలోని ప్రయాణీకులకు పొట్టేల్ చిత్ర పాంప్లేట్లు పంచారు. అలాగే ప్రతి ఒక్కరూ పొట్టేల్ చిత్రాన్ని థియేటర్‌కి వెళ్ళి చూడాలని ప్రయాణీకులను కోరారు. ఈ ప్రమోషన్స్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.