బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (16:29 IST)

అనన్య పాండేపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు.. కారణం అదే!

Ananya Nagalla
తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరద బాధితుల కోసం సినీ హీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం వరద బాధితుల కోసం ఎలాంటి విరాళాలు ప్రకటించలేదనే చెప్పాలి. 
 
అయితే టాలీవుడ్ యువ నటి అనన్య నాగళ్ల తనవంతుగా సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా  ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు ఇస్తున్నట్టు అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 
 
ఈ నేపథ్యంలో అనన్య పాండేపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో, అనన్య నాగళ్ల ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 
 
"ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్ధమాన నటి, కుమారి అనన్య నాగళ్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్నిస్తుంది" అంటూ పవన్ కల్యాణ్ తరఫున ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 
 
అందుకు అనన్య నాగళ్ల వినమ్రంగా స్పందిస్తూ, థాంక్యూ సో మచ్ సర్ అంటూ బదులిచ్చింది. మీరు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్ చేసింది.