ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (22:01 IST)

వైరల్ ఫీవర్ బారిన పడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. ఫ్యామిలీ కూడా..?

Pawan Kalyan, Anna Lezhneva
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే పవన్ కూడా జ్వరంతో బాధపడుతున్నారు. పవన్ కల్యాణ్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. 
 
వైరల్ జ్వరంతో ఆయన అనారోగ్య బారిన పడ్డారు. జ్వరం వున్నప్పటికీ ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తన నివాసంలోనే సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
కాగా, వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నెలకొనేలా కృషి చేయాలని... అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
 
ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్‎లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఏకధాటిగా వానలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. వరద బాధితులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉండి ధైర్యం చెబుతున్నారు.