ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (19:01 IST)

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

Prabhas  Diljit Dosanjh
Prabhas Diljit Dosanjh
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ మేకర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ 'భైరవ అంథమ్' ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇండియన్స్ మోస్ట్ మ్యాసీవ్ టాలెంట్ ని ఒకచోట చేర్చింది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాటలో గ్లోబల్ ఐకాన్‌లు ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్‌ ఆదరగొట్టారు.
 
'కల్కి 2898 AD' మూవీ ఒక డ్రీమ్ గా పిలువబడుతుంది. దేశంలోని బిగ్గెస్ట్ స్టార్స్ ని ఒక్కచోటికి చేర్చింది, కామిక్-కాన్ శాన్ డియాగోలో తనదైన ముద్ర వేసిన మొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది, యానిమేటెడ్ ప్రిల్యుడ్ ప్రజెంట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ మూవీ కల్కి, 4-టన్నుల ఫ్యూచరిస్టిక్ వెహికిల్ 'బుజ్జి' ప్రస్తుతం ఇండియాలో టూర్ చేస్తోంది. ఇప్పుడు, మేకర్స్ నార్త్, సౌత్ ఇండియా కల్చర్ రిచ్ నెస్ ని ఒక అంథమ్ బ్లెండ్ చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెరిగాయి.
 
మ్యూజిక్ వీడియో కాశీ డార్క్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో సెట్ చేయబడిన ఒక విజువల్ మార్వల్. దిల్జిత్ దోసాంజ్, విజయనారాయణ్ పాడిన ఈ పాటకు  కుమార్ లిరిక్స్ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ ట్రాక్ సినిమాలోని ప్రభాస్ భైరవ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్  డిస్ స్క్రిప్షన్. పోనీ వర్మ కొరియోగ్రాఫ్ చేసిన ఈ వీడియోలో బ్లాక్ లుంగీలు, తలపాగాలు ధరించి దిల్జిత్, ప్రభాస్ యూనిక్ స్టయిల్ లో అలరించారు. ప్రభాస్ తన లుంగీని ఎత్తుకుని, తన సిగ్నేచర్ స్వాగ్‌తో వెళ్లిపోయినప్పుడు, దిల్జిత్‌ను ప్రశంసలతో చేతులు కలపడం వీడియోలో హైలైట్ గా నిలిచింది. ఇది ట్రూలీ మైక్ డ్రాప్ మూమెంట్!!
 
'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.