రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్-శ్రద్ధాల 'సాహో' ప్రీ-రిలీజ్... 1, 00,000 మంది ప్రేక్షకులు రెడీ...

Sradha Kapoor-Prabhas
Last Modified బుధవారం, 14 ఆగస్టు 2019 (20:32 IST)
సాహో ట్రెయిలర్ హైప్‌ ఓ స్థాయిలో వుంది. ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి మీడియా, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నాలుగు భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ కేవలం 48 గంటల్లో 70 మిలియన్ మార్క్ దాటేసింది. ట్రైలర్ లాంచ్ తరువాత, ప్రభాస్ తన హైదరాబాద్ నగర పర్యటనకు సిద్ధమవుతున్నాడు.

సాహో నిర్మాతలు ఆగస్టు 18న సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ ప్రి-రిలీజ్ అతిపెద్దదిగా వుండనుందని సమాచారం. ఈ ఈవెంట్‌కి సుమారు 1,00,000 మంది ప్రేక్షకులు హాజరవుతారని చెపుతున్నారు. ప్రభాస్ మానియాలో ఊగిపోతున్న ఫ్యాన్స్ అతడి చిత్రం కోసం 2 సంవత్సరాల సుదీర్ఘకాలం వేచి వున్నారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ తన అభిమానులను కలవడానికి రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక కాబోతోంది.

బాహుబలి 2 విడుదలైనప్పుడు ప్రభాస్ తన ఫ్యాన్సుతో సంభాషించాడు. మళ్లీ రెండేళ్ల తర్వాత సాహోతో వస్తున్నాడు. ఈ కార్యక్రమంలో వేదికపై సహనటి శ్రద్ధా కపూర్‌తో పాటు మూవీ మేకర్స్ వుంటారు. ఈ మూవీని ఒకేసారి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు.

'సాహో' చిత్రాన్ని టి-సిరీస్ సమర్పించగా, యువి క్రియేషన్స్ నిర్మించింది. సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2019 ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.దీనిపై మరింత చదవండి :