గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (17:55 IST)

బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేసిన క్రిస్ గేల్ (video)

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు క్రిస్ గేల్. క్వీన్స్‌పార్క్‌లో ఆదివారం భారత్‌తో జరిగిన వన్డేలో గేల్ ఈ రికార్డును సాధించాడు. వన్డేల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఘనత ఇప్పటి వరకు బ్రియాన్ లారా (10,405) పేరిట ఉంది. 
 
ఆదివారం నాటి మ్యాచ్‌లో 11 పరుగులకే గేల్ వెనుదిరిగినప్పటికీ, 10,408 పరుగులతో లారాను రెండో స్థానంలోకి నెట్టేశాడు క్రిస్ గేల్. అంతేకాదు, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 300వ వన్డేను ఆడాడు. ఈ క్రమంలో లారా (299 వన్డేలు) మరో రికార్డును కూడా అధిగమించాడు.
 
మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి చాలా కాలం తర్వాత మూడంకెల స్కోరు సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ 107 పరుగులు సాధించాడు.112 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 42వ శతకం కావడం గమనార్హం.