శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (17:15 IST)

కోహ్లీ రికార్డును మాయం చేసిన స్మిత్ (Video)

ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులోనే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును అధికమించాడు. గురువారం మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ 24వ టెస్ట్ సెంచరీ పూర్తిచేశాడు. 
 
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది 24వ టెస్టు సెంచరీ. దీనిని అందుకోవడానికి స్మిత్‌కు 118 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, కోహ్లీ 123 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు దక్కించుకోగలిగాడు. కాగా, వీరిద్దరి కంటే ముందు వరుసలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 66 ఇన్నింగ్స్‌లలో 24 సెంచరీలు పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. 
 
ఇకపోతే, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టుపై స్మిత్ చేసిన 144పరుగులకుగాను ఆసీస్ 284 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో స్మిత్ ప్రదర్శన చూసిన ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ వా ప్రశంసలతో ముంచెత్తాడు. '142పరుగులకు 8 వికెట్లు నష్టపోయినప్పుడు పడుకున్నా. లేచి చూసేసరికి స్కోరు డబుల్ అయింది. స్మిత్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. జట్టుపై ప్రత్యేకమైన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. మళ్లీ ఆస్ట్రేలియా ఊపందుకుంది' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.