సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (12:25 IST)

2050 ప్రపంచకప్‌లో ఆడే టీమిండియా జట్టు.. ఫేస్ యాప్ ఛాలెంజ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో సరికొత్తగా ఫేస్ యాప్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. ఈ ఫేస్ యాప్ ఛాలెంజ్ ద్వారా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ టీమిండియా క్రికెటర్లు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో ఈ యాప్‌ ద్వారా రూపొందించి ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు. 
 
విరాట్‌ కోహ్లి, ధోని, రవీంద్ర జడేజా, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రోహిత్‌ శర్మ తదితరులు ఈ ఫోటోల్లో వృద్ధాప్యంలో కనిపించారు. ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
 
కాగా, ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశలో అద్భుతంగా ఆడిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2050లో ఆడే టీమిండియా జట్టు ఎలా వుంటుందో యాప్ ద్వారా రూపొందించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.