శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (11:12 IST)

'స్పిరిట్‌'కు ప్రభాస్ రికార్డు స్థాయి పారితోషికం

భారతదేశంలో ఉన్న హీరోల్లో అత్యధిక పారితోషికం తీసుకోనున్న హీరోగా టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ నిలువనున్నారు. ఈయన హీరో సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. టీ సిరీస్‌, సందీప్‌ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్థ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. 
 
ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్‌ పాన్‌ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్‌ పొందుతున్నాడని బీ టౌన్‌ టాక్‌. ‘స్పిరిట్‌’ సినిమాకు ప్రభాస్‌ ఏకంగా రూ.150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడని బాలివుడ్‌ ట్రేడ్‌ టాక్‌.
 
ఇప్పటికే బాలివుడ్‌లో వంద కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యూనిరేషన్‌ అందుకుంటున్న స్టార్‌ హీరోలు పలువురున్న విషయం తెలిసిందే. 'బాహుబలి'తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఈ ‘స్పిరిట్‌’ సినిమాతో అత్యంత భారీ స్థాయి పారితోషికం అందుకుంటున్న స్టార్‌ హీరోగా నిలుస్తున్నాడని సమాచారం.