సంబంధిత వార్తలు
- తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు
- 1000 వర్డ్స్ చిత్రం చూశాక కన్నీళ్లు వచ్చాయి :రేణూ దేశాయ్
- అల్లు అర్జున్ థియేటర్ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?
- లైలా చిత్రం గెటప్ లో వున్నా స్నేహమే లాక్కొచ్చింది : విశ్వక్ సేన్
- కేవలం 5 రోజుల్లో బోరుగడ్డకి సినిమా చూపించా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది
Prajwal Devaraj- Rakshasa
తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. కూతురుపై ఉన్న ప్రేమతో ఇందులో హీరో చేసిన చర్యలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నోబిన్ పాల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ టైమ్ లూప్ హారర్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై బజ్ ను పెంచగా, తాజాగా విడుదలైన టైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ.."ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. ప్రజ్వల్ దేవరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కు మంచి ఆదరణ దక్కుతోంది. సినిమా కూడా అందరూ ఇష్టపడేలా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. బాగా ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది" అని చెప్పారు.
ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు నటిస్తున్నారు.
